![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 రెండో వారం పూర్తయింది. మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండవ వారం షకీల ఎలిమినేట్ అయింది. అయితే హౌజ్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ రాగా ప్రస్తుతం 12 మంది ఉన్నారు. అందులో శివాజీ, ఆట సందీప్ ఇద్దరు కన్ఫమ్ హౌజ్ మేట్స్ అయ్యారు.
షకీ అమ్మగా బిగ్ బాస్ హౌజ్ లోకి షకీల అడుగుపెట్టింది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో షకీలకి ఒక పవర్ ఫుల్ AV ని తీర్చిదిద్దారు మేకర్స్. అయితే రెగ్యులర్ కంటెస్టెంట్స్ కి కాస్త భిన్నంగా కొత్త కంటెంట్ కోసం షకీలాని తీసుకున్నట్టుగా తెలిసింది. షకీలాని పాజిటివ్ గా చూపించడానికి, ఫ్యామిలీ ఆడియన్స్ కి తనని దగ్గర చేయడానికి తను ఎదుర్కున్న పరిస్థితులని, అవమానాలని చూపించారు మేకర్స్. తను ఎన్నో బీ గ్రేడ్ సినిమాల్లో చేసాక తనకి చాలా అవమానాలు ఎదురయ్యాయని చెప్పింది షకీల. డబ్బుల కోసం వాళ్ళ అమ్మ మొదటిసారి షకీలాని అక్కడికి పంపించందంట. అయితే తను అప్పుడు ప్లే గర్ల్స్ అనే పిక్చర్ ఓకే అయిందంట. అదే టైమ్ లో డబ్బులకి ఇబ్బంది అవుతుందని వాళ్ళ అమ్మ పంపించిందంట. వాళ్ళ అక్కతోనే షకీలా వెళ్ళిందని ఒక ఇంటర్వూలో చెప్పింది. కాగా తను ఇలా అవడానికి కారణమేంటి? ఎందుకిలా జరిగిందని షకీలా చాలాసార్లు చెప్పుకొని బాధపడింది. అయితే తన గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలని చూపిస్తూ, తన ఆఫ్ స్క్రీన్ లైఫ్ ఎలా ఉందని AV లో చూపించారు బిగ్ బాస్ మేకర్స్. షకీల తన గతాన్ని చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. వాళ్ళ అక్క తనని ఎదగనివ్వకుండా చేసిందని, తను సినిమాల్లో చేస్తే వచ్చిన డబ్బులతో ఒక్క ల్యాండ్ కూడా తీసుకోకుండా చేసిందంట. ఎందుకంటే తను(షకీల) రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోతుందేమోనని వాళ్ళ అక్క కావాలనే డబ్బులని ఖర్చు చేసిందంట. ఇలా తన గురించి చెప్పుకొచ్చింది షకీల.
ఒక అమ్మగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది షకీల. హోస్ట్ నాగార్జున దగ్గరికి రాగానే షకీల ఎమోషనల్ అయింది. షాషా అండ్ తంగం ఇద్దరు తమ బాగోగోలు చూసుకుంటారని, వాళ్ళిద్దరిని బిడ్డలుగా చూసుకుంటుందంట షకీల. అయితే వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి రాగానే ఏడ్చేసింది షకీల. 'బాగా ప్లే చేయండి మీరేంటో మాకు తెలుసని' తంగం చెప్పింది. ట్రాన్స్ జెండర్స్ ని తీసుకొని చేరదీసిందంట షకీల. ఫస్ట్ కూతురు తంగం, రెండో కూతురు షాషా. తనకి ఇక్కడ దేశంలోనే కాకుండా వరల్డ్ నుండి ట్రాన్స్ జెండర్స్ లో అభిమానులున్నారంట. ఆరవ కంటెస్టెంట్ గా షకీల ఎంట్రీ ఇచ్చింది. తెరమీద చూసిన షకీల వేరంటూ లోపలికి వెళ్ళి కంటెస్టెంట్స్ అందరికి అమ్మ లేని లోటుని తీర్చిందని బిగ్ బాస్ ప్రేక్షకులకు తెలిసిపోయింది. అయితే తనకి వారానికి మూడు లక్షల చొప్పున బిగ్ బాస్ టీమ్ ఇచ్చారంట. కాగా రెండు వారాలకి ఆరు లక్షల వరకు తీసుకుంది షకీల. అయితే తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని అందరికి తెలిసిందే. కాగా షకీ అమ్మ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు.
![]() |
![]() |